కరీంనగర్ కమాన్చౌరస్తా, ఏప్రిల్ 12 : ఇంటర్ ఫలితాల్లో అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలకు చెందిన వివిధ విభాగాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ మారులు సాధించారని విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వావిలాలపల్లి కేంద్ర కార్యాలయంలో విద్యార్థులను అభినందించి, వివరాలు వెల్లడించారు. సీనియర్ ఇంటర్లో ఎంపీసీ విభాగంలో కే పల్లవి 996, జీ హైందవి 996, డీ ప్రణవి 996, వై శ్రీనిత్య 996 మార్కులతో రాష్ట్రస్థాయిలో అత్యున్నత స్థానంలో నిలిచారని చెప్పారు. 15 మంది విద్యార్థులు 995 ఆపై మారులు, 202 మంది విద్యార్థులు 990 ఆపై మారులు సాధించారని తెలిపారు. సీనియర్ ఇంటర్ బైపీసీలో ఆర్ వైష్ణవి 995, కే హారిక 995, నభిలాతాహేన్ 995, ఎస్ బ్రహ్మణి 995, ఎస్ ఐశ్వర్య 995 మారులు సాధించి అగ్రగామిగా నిలిచారని వివరించారు. 38 మంది విద్యార్థులు 990 ఆపై మారులు సాధించినట్టు చెప్పారు.
ఎంఈసీలో కే మానస 988, సీఈసీలో పీ బావోజ్ఞ 987 మారులు సాధించగా, 970 ఆపై మారులు 18 మంది విద్యార్థులు సాధించినట్టు చెప్పారు. ఫస్టియర్లో ఎంపీసీలో డీ వినీష 469, జీ అక్షర 469 మారులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారని వివరించారు. 61 మంది విద్యార్థులు 468 ఆపై మారులు, 176 మంది విద్యార్థులు 467 ఆపై మారులు సాధించి అల్ఫోర్స్ ఖ్యాతిని దశదిశలా చాటారని చెప్పారు. బైపీసీలో ఎస్ జాగృతి 439, ఏ హస్విత 439, ఖాన్సా అలియా 439, జీ కావ్యశ్రీ 439 మారులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారని తెలిపారు. 20 మంది విద్యార్థులు 438 ఆపై మారులు సాధించారని, 46 మంది విద్యార్థులు 437 ఆపై మారులు సాధించారని, 77 మంది విద్యార్థులు 436 ఆపై మారులు సాధించారని పేర్కొన్నారు. ఎంఈసీలో ఎం మహాలక్ష్మి 493, సీఈసీలో వీ దీక్షిత 494, అనామ్మహ్రూజ్ 494 మారులు సాధించారని పేర్కొన్నారు. అత్యుత్తమ, నాణ్యమైన బోధన ద్వారా అద్భుతాలు సృష్టించవచ్చని, ఇందుకు నేటి ఇంటర్మీడియట్ ఫలితాలే నిదర్శనమని చెప్పారు. రానున్న రోజుల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారని విశ్వాసాన్ని విశ్వాసం వ్యక్తంచేశారు.
టాప్ -10లో 780 మంది ‘రెసోనెన్స్’ విద్యార్థులు
హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): ఇంటర్ ఫలితాల్లో రెసోనెన్స్ విద్యార్థులు సత్తాచాటారని విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు వెల్లడించారు. టాప్-5లో 345 మంది, టాప్ -10లో 780 మంది విద్యార్థులున్నట్టు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. సీనియర్ ఇంటర్లో రేవంత్ వంగల 994, షేక్ ఐరా జాసియా 995 మార్కులతో టాపర్గా నిలిచినట్టు వెల్లడించారు. వందలాది మంది విద్యార్థులు గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో వందశాతం స్కోర్ సాధించినట్టు ప్రకటించారు. ప్రతిభ చూపిన విద్యార్థులను వారు ప్రత్యేకంగా అభినందించారు.
నారాయణ ఆల్టైమ్ రికార్డు
హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తుమ మార్కులతో నారాయణ విద్యాసంస్థలు ఆల్టైమ్ రికార్డు నెలకొల్పినట్టు విద్యాసంస్థల డైరెక్టర్లు సింధూర, శరణి, రమానారాయణ తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 470మార్కులకు 469 మార్కులతో కే సాయిగౌతమ్, జీ వరేణ్య స్టేట్ ఫస్ట్ మార్కులు సాధించి విజయదుందుభి మోగించారని తెలిపారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో ఐదుగురు విద్యార్థులు 996 మార్కులు, బైపీసీలో ముగ్గురు విద్యార్థులు 994 మార్కులు సాధించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను వారు ప్రత్యేకంగా అభినందించారు.
ఇంటర్ ఫలితాల్లో శ్రీచైతన్య ప్రభంజనం
హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): ఇంటర్ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థలు ప్రభంజనం సృష్టించినట్టు సంస్థ అకాడమిక్ డైరెక్టర్ సుష్మ బొప్పన తెలిపారు. బైపీసీ సెకండియర్ విద్యార్థి కే జ్యోత్స్న వెయ్యికి 997 మార్కులతో స్టేట్ టాపర్గా నిలిచినట్టు ఒక ప్రకటనలో తెలిపా రు. ఎంపీసీ సెకండియర్ విద్యార్థి పీ ప్రియలక్ష్మి 996తో సత్తా చాటినట్టు పేర్కొన్నారు. ఫస్టియర్లో గ్యాజంగి విశ్వతేజ్, రిషయు మైతి 469 మార్కులతో సత్తాచాటినట్టు తెలిపారు. ఫస్టియర్ ఎంపీసీలో 4,497 మంది 460 ఆపై మార్కులు సాధించినట్టు వెల్లడించారు.