కరీంనగర్ కమాన్‌చౌరస్తా, సెప్టెంబర్ 9 : నీట్-2022 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు ప్రతిభ కనబర్చి వివిధ కేటగిరీల్లో ఉత్తమ మార్కులు సాధించినట్టు ఆ విద్యా సంస్థల చైర్మన్ వీ నరేందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. కళాశాలకు చెందిన దోమల అనుష 650 మారులతో అగ్రస్థానంలో నిలిచిందని, ఆమెతోపాటు సుమారు 50 మంది విద్యార్థులకు ఎంబీబీఎస్‌లో సీటు సాధించే అకాశం ఉన్నదన్నారు. అలాగే, ఇంటర్ ఫలితాల్లో 468 మారులతో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవడంతోపాటు ఐఐటీ మెయిన్స్‌లో 400 మందికిపైగా విద్యార్థులు అద్భుత మారులతో ఐఐటీ (అడ్వాన్స్డ్)కు అర్హత సాధించినట్టు తెలిపారు.