కమాన్చౌరస్తా, మే 9 : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ జూనియర్ కళాశాలల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అద్వితీయ ఫలితాలు సాధించారని ఆ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్ రెడ్డి తెలిపారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులను మంగళవారం కరీంనగర్లోని వావిలాలపల్లి కేంద్ర కార్యాలయంలో ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, పటిష్ఠమైన ప్రణాళికతో వివిధ అంశాలను రాష్ట్రంలోనే అనువభవజ్ఞులైన అధ్యాపకులతో బోధిస్తూ, ఘన విజయాలు నమోదు చేస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో 1000 మారులకు ఎస్ హర్షిత 992, ఎస్ ఉజ్వల్ 992, ఎస్ హరిణి 992, జీ వినిత 992, కే రాజశేఖర్ 992, ఎస్ ప్రణతి 991, డీ వివేకవర్ధన్ 991, సీహెచ్ రిషిత 991, బీ హరిణి 991, ఎం అరుణ్ కుమార్ 991, ఎం ప్రణవి 990, జి సుదేష్ణ 990, టీ స్ఫూర్తి 990, ఏ అక్షయ 990, టి శ్రీజ 990 మారులు సాధించి ఉన్నతస్థానంలో నిలిచారని వివరించారు. 28 మంది విద్యార్థులు 989 ఆపైన మారులు సాధించడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. బైపీసీలో ఎస్ నిహారిక 992, పీ నిహారిక 990, జీ నవ్య 990, ఎస్ మనస్విని 990 మారులు సాధించారని తెలిపారు.
ఎంఈసీ విభాగంలో సీహెచ్ మనీషా 988, జీ అమూల్య 988, టీ అర్చన 986, ప్రవళిక 984 మారులు సాధించారన్నారు. 20 మంది విద్యార్థులు 970 ఆపై మారులు సాధించారు. సీఈసీ విభాగంలో ఎం సాయిప్రసన్న 984, బీ ప్రియాంక 982 సాధించారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో 470 మారులకు టీ సాయిత్య 467, టీ చరిత 467, డీ సునీత 467, కే కార్తీక్ బాబు 467, ఎస్ రిషిక 467, వీ అనన్య 467, ఏ శృతకీర్తి 467, పీ చరణ్య 467, పీ శ్రీశాంత్ రెడ్డి 467, ఎం రాకేశ్ 467 మారులు సాధించి అత్యుత్తమ స్థానంలో నిలిచారని, 10 మంది విద్యార్థులు 467 మారులు, 36 మంది విద్యార్థులు 466 మారులు, 52 మంది విద్యార్థులు 465 మారులు సాధించి అల్ఫోర్స్ ఖ్యాతిని పెంచారని పేర్కొన్నారు. బైపీసీ విభాగంలో 440 మారులకు ఏ శ్రీనిధి 437, సీహెచ్ నిఖిల్ 436, ఠాకూర్ సాయిచరణ్ సింగ్ 436, ఈ ఐశ్వర్య వర్మ 436 మారులు సాధించారని, మరో తొమ్మిది మంది విద్యార్థులు 435 ఆపై మారులు పొందారని చెప్పారు. ఎంఈసీ విభాగంలో 500 మారులకు ఎం వినమ్రత 488, సీఈసీ విభాగంలో నిమ్రాఅజ్మీ 490, అంటే 480 ఆపై మారులు ఐదుగురు విద్యార్థులు సాధించగా, సీఈసీలో 8 మంది విద్యార్థులు కైవసం చేసుకొన్నారని నరేందర్రెడ్డి వివరించారు.