ఆలేరు రూరల్, ఏప్రిల్ 10 : ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి అయిలయ్య వచ్చారు. ఈ సందర్భంగా అదే గ్రా మానికి చెందిన రైతు అంజయ్య.. గ్రామాల్లో చెరువులు నింపి రైతులను ఆదుకోవాలంటూ ఎమ్మెల్యేను నిలదీశారు. దాంతో అయిలయ్య స్పందిస్తూ ‘నువ్వే ఉన్నావా అడగడానికి పీకుడుగాడివి’ అంటూ దురుసుగా నోరు పారేసుకున్నారు. దాంతో అక్కడున్న రైతులంతా ఇలా మాట్లాడడం సరికాదనడంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఆఖరికి ఎమ్మెల్యే సమాధానం చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎమ్యెల్యే తమకు క్షమాపణ చెప్పాలని రైతులు డిమాండ్ చేశారు.