అలంపూరు/రాజోళి, జనవరి 29 : పచ్చని గ్రామాల మధ్య చిచ్చు పెట్టే ఇథనాల్ కంపెనీ ఏర్పాటును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి స్పష్టంచేశారు. ఆ కంపెనీ అనుమతులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా రాజో ళి మండలం పెద్ద ధన్వాడలో రైతులు ఇథనాల్ కం పెనీ ఏర్పాటును నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. బుధవారం ఎమ్మెల్యే విజయుడుతో కలిసి ఎమ్మెల్సీ చల్లా మద్దతు తెలిపారు.
రైతులకు కీడు చేసే కంపెనీలు ఏవైనా అనుమతించేది లేదని స్పష్టంచేశారు. రైతులకు ఏ కష్టం వచ్చినా తాము ఉంటామని భరోసా కల్పించారు. రైతుల అభిప్రాయాలు సేకరించకుండా ఇష్టానుసారంగా ఎలా ఏర్పాటు చేస్తారని, ఇథనాల్ పరిశ్రమ అనుమతులు రద్దు చేయాలని కోరుతూ ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి, కలెక్టర్కు వినతిపత్రాలు అందజేసినట్టు తెలిపారు. ఇథనాల్ కంపెనీ అనుమతులను ప్రభు త్వం రద్దు చేసే వరకు ఊరుకునేది లేదని ఎమ్మెల్యే విజయుడు తేల్చిచెప్పారు.