హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ పరిధిలోని ఫౌండేషన్, జిల్లాస్థాయి సీవోఈ (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) గురుకులాల్లో 31న స్పాట్ అడ్మిషన్లను నిర్వహించనున్నారు. ఈ మేరకు సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇప్పటివరకు 4దశల్లో అడ్మిషన్లు నిర్వహించామని, మిగిలిన సీట్లను 31న స్పాట్ అడ్మిషన్లో భర్తీ చేస్తామని చెప్పారు. వివరాలకు సొసైటీ వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.
28న టీఏసీ సమావేశం
హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): ట్రైబల్ అడ్వయిజరీ కమిటీ (టీఏసీ) సమావేశాన్ని 28న నిర్వహించనున్నారు. గిరిజనుల సమగ్రాభివృద్ధికి సంబంధించి రూపొందించాల్సిన పథకాలు, అమలు చేయాల్సిన కార్యక్రమాలను టీఏసీ నిర్ణయిస్తుంది. టీఏసీలో గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ్యులుగా ఉంటారు. ప్రతి ఆరునెలలకోసారి ఈ సమావేశాన్ని నిర్వహించాలి. 28న ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు.