రైతుల కంటతడి రాష్ట్రానికి మంచిది కాదు : ఆల వెంకటేశ్వర్ రెడ్డి
రైతుల కంటతడి రాష్ట్రానికి మంచిది కాదని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు.
దేవరకద్ర : రైతుల కంటతడి రాష్ట్రానికి మంచిది కాదని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరు గ్రామంలో ఎండిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వానకాలం పంటలు కూడా కాపాడలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. డోకూరులో జానకమ్మ కౌలుకు తీసుకొని సాగు చేస్తే మొత్తం పంట ఎండిపోయింది.
జానకమ్మ లాంటి రైతు కంటతడి పెడితే రాష్ట్రానికి మంచిది కాదన్నారు. ఐదు లక్షలు పెట్టుబడి పెడితే ఐదు రూపాయలు కూడా రాలేదన్నారు. గతంలో కోయిల్ సాగర్ నుండి దేవరకద్ర పెద్ద చెరువుకు నీళ్లు వదిలే వాళ్లం. అక్కడి నుండి వరుసగా చెరువులు నిండేవన్నారు. ప్రజలకు ఉపయోగపడని పదవులు ఎందుకు అని ప్రశ్నించారు.
కోయిల్ సాగర్ నుండి లగచర్లకు నీళ్లు తీసుకెళ్లేందుకు సర్వే నడుస్తుంది. కోయిల్ సాగర్ నుండి నీటి తరలింపు ప్రతిపాదన విరమించుకోవాలన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటింలన్నారు. అలాగే రైతులకు ఎకరాకు యాభై వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ.. పాదయాత్ర మొదలుపెట్టిన చిన్న నరసింహ
రైతుల కంటతడి రాష్ట్రానికి మంచిది కాదు : ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Abhishek Sharma: అభిషేక్ శర్మ ఊచకోత.. 35 బంతుల్లో సెంచరీ
‘వరి కొయ్యలను కాల్చొద్దు’
Nana Kutti | విడుదలకు ముందే భారీ డిమాండ్.. విజయ్ ఆంటోని ‘నాన్న కుట్టి’ డిజిటల్ హక్కులు దక్కించుకున్న ప్రైమ్ వీడియో!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

