హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం మూడు కమిషన్లకు చైర్మన్లను నియమించింది. రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్గా ఎం కోదండరెడ్డి, విద్యా కమిషన్ చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని నియమించింది.
వీరి పదవీకాలం రెండేండ్లు ఉంటుంది. బీసీ కమిషన్ చైర్మన్గా నిరంజన్, సభ్యులుగా రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాల లక్ష్మి నియమితులయ్యారు. దీనికి బీసీ వెల్ఫేర్ కమిషనర్ మెంబర్ సెక్రటరీగా ఉంటారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి శుక్రవారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీచేశారు.