Akbaruddin Owaisi | హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): సకలం చెరువులో ఉన్న ఒవైసీ విద్యాసంస్థలపై సామాజికమాధ్యమాల్లో ప్రచారమవుతున్న పోస్టులపై ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సోమవారం స్పందించారు. ట్యాంక్‌బండ్ బఫర్ జోన్లో ఉన్న నెక్లెస్రోడ్ని కూడా కూల్చివేస్తారా అని నిలదీశారు. తనపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించుకోవచ్చని, ఒవైసీ విద్యాసంస్థను మాత్రం కూల్చవద్దని అన్నారు.
పేదలకు ఉచితవిద్యను అందించేందుకు 12 భవనాలను నిర్మించానని, వీటిని ఉద్దేశపూర్వకంగా కొందరు తప్పుగా చూపిస్తున్నారని తెలిపారు. గతంలో తనపై కాల్పులు జరిగాయని, కావాలంటూ మళ్లీ కత్తులతో దాడి చేసుకోవచ్చని, కానీ పేదల విద్యాభివృద్ధికి చేస్తున్న కృషికి అడ్డుపడొద్దని అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు.