Akbaruddin Owaisi | తెలంగాణ ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ
Akbaruddin Owaisi | తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ఆరు సార్లు శాసనసభకు ఎంపికైన ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ను నియమించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో శనివారం ఆయన ప్రమాణస్వీకారం చేయించనున్నారు. రేపటి (శనివారం) నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ఆరు సార్లు శాసనసభకు ఎంపికైన ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ను నియమించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో శనివారం ఆయన ప్రమాణస్వీకారం చేయించనున్నారు. రేపటి (శనివారం) నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నాలుగో రోజులపాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. కొత్త స్పీకర్‌ను ఎన్నుకునే వరకు అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించనున్నారు.
సీనియారిటీ ప్రకారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించాల్సి ఉంది. ఆయన 8 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. కానీ ఇవాళ ఆయన కాలు జారిపడటంతో గాయాలయ్యాయి. దాంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆయనకు 8 వారాల పాటు విశ్రాంతి అవసరమని చెప్పారు. ఇక తర్వాత వరుసలో బీఆర్ఎస్ నుంచి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉండగా, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. కాంగ్రెస్ నేతలు ఇద్దరూ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. దాంతో రేవంత్ సర్కారు అక్బరుద్దీన్ ఒవైసీ వైపు మొగ్గుచూపింది. ప్రభుత్వ వినతిని అక్బరుద్దీన్ స్వీకరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

