హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వైద్య విధాన పరిషత్తు (టీవీవీపీ) కమిషనర్‌గా డాక్టర్ జే అజయ్‌కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన కామారెడ్డి జిల్లా దవాఖాన సూపరింటెండెంట్‌గా, టీవీవీపీ జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. డీఎంఈ రమేశ్‌రెడ్డి టీవీవీపీకి ఇంచార్జి కమిషనర్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ప్రభుత్వం పూర్తిస్థాయి కమిషనర్‌గా అజయ్‌కుమార్‌ను నియమించింది.