హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 78 ఏండ్లు గడుస్తున్నా దళితులు నేటికీ వివక్షకు గురవుతున్నారని, ఇది సమాజం సిగ్గుపడాల్సిన విషయమని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా పేర్కొన్నా రు. హైదరాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్లో నిర్వహించిన ఏఐఆర్డీ ఎం 2వ జాతీయ మాహాసభల ముగింపు కార్యక్రమంలో అజీజ్ పాషా మాట్లాడుతూ..
అత్యాచారాల నిరోధక, అంటరానితనం నిర్మూలన లాంటి చట్టాలు వచ్చినప్పటికీ దేశవ్యాప్తంగా దళితులపై దాడులు కొసాగుతూనే ఉన్నాయని వా పోయారు. ఏఐడీఆర్‌ఎం జాతీయ అధ్యక్షుడు రామ్మూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏఐడీఆర్‌ఎం జాతీయ ప్రధాన కార్యదర్శి వీ ఎస్ నిర్మల్‌కుమార్, జాతీయ నాయకులు ఎం బాలనరసింహ, కే ఏసురత్నం, మరుపాక అనిల్‌కుమార్, దేవికుమారి, లెనిన్ తదితరులు పాల్గొన్నారు.