T Congress List | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ 16 స్థానాల్లో అభ్యర్థులతో మూడో జాబితాను సోమవారం రాత్రి ప్రకటించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. కామారెడ్డి నుంచి అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఆయన ఇప్పటికే కొడంగల్ స్థానం నుంచి బరిలో ఉన్న సంగతి తెలిసిందే. వనపర్తి, బోథ్ స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. వనపర్తి నుంచి సీనియర్ కాంగ్రెస్ నేత జీ చిన్నారెడ్డి స్థానంలో తుడి మేఘా రెడ్డి పేరును, ఆదిలాబాద్ జిల్లా బోథ్ నుంచి ఆదే గజేందర్ అభ్యర్థిత్వాన్ని ఏఐసీసీ ఖరారు చేసింది. ఇంతకుముందు బోథ్ నుంచి వన్నెల అశోక్‌కు టికెట్ కేటాయించారు. సూర్యాపేట, తుంగతుర్తి స్థానాల్లో అభ్యర్థులను పెండింగ్‌లో పెట్టింది.
చెన్నూర్- డాక్టర్ జీ వివేక్
బోథ్-ఆదే గజేందర్
జుక్కల్ (ఎస్సీ) – తోట లక్ష్మీకాంతరావు
బాన్సువాడ -ఏనుగు రవీందర్ రెడ్డి
కామారెడ్డి – రేవంత్ రెడ్డి
నిజామాబాద్ అర్బన్- మహ్మద్ షబ్బీర్ అలీ
కరీంనగర్- పురుమళ్ల శ్రీనివాస్
సిరిసిల్ల – కేకే మహేందర్ రెడ్డి
నారాయణ్ ఖేడ్- సురేశ్ కుమార్ షెట్కార్,
పఠాన్ చెరు- నీలం మధు ముదిరాజ్
వనపర్తి- తుడి మేఘారెడ్డి
డోర్నకల్ (ఎస్టీ) -డాక్టర్ రామచంద్రు నాయక్,
ఇల్లందు (ఎస్టీ) – కోరం కనకయ్య,
వైరా (ఎస్టీ) – రాందాస్ మాలోత్,
సత్తుపల్లి (ఎస్సీ)- డాక్టర్ మట్ట రాగమయి,
అశ్వరావుపేట (ఎస్టీ) జారే ఆది నారాయణ.