Artificial Intelligence | హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇంజినీరింగ్.. సైన్స్కోర్సులకు మాత్రమే పరిమితం. కానిప్పుడు ఇదే ఏఐ బీఏ ఆర్ట్స్ కోర్సుల్లోనూ ఉం టుంది. బీఏ ఎకనామిక్స్, బీఏ పొలిటికల్ సైన్స్ కోర్సుల్లోనూ అంతర్భాగమవుతుంది. అయితే ఏఐ కోర్సుగా కాకుండా ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యామండలి అధికారులు నిర్ణయించారు. డాటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాలపైనా పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఆర్ట్స్ కోర్సుల్లోనూ సెమినార్లు, ప్రాజెక్టులు/ ఇంటర్న్‌షిప్‌లు ప్రవేశపెట్టాలని సోమవారం నిర్వహించిన ఆర్ట్స్ సిలబస్ రివిజన్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కా ర్యాలయంలో నిర్వహించిన సమావేశంలో చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, వైస్‌చైర్మన్ ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం, మండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ పాల్గొన్నారు.
సివిల్స్.. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్.. ఆర్ఆర్బీ, ఐబీపీఎస్ ఇలా ఏదీ తీసుకున్నా రీజనింగ్, అర్థమెటిక్ చదవాల్సిందే. కానీ ఇవేవీ మనం చదువుకునే పాఠశాల విద్య, ఇంటర్, డిగ్రీలో ఉండవు. ఎక్కడా ఎదురవవు. కానీ కొలువు సాధించాలంటే ఈ సబ్జెక్టులే కీలకం. వీటిల్లో కనీస పరిజ్ఞానం లేక మన విద్యార్థులు నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో డిగ్రీలో రీజనింగ్, అర్థమెటిక్ డిగ్రీ కోర్సుల్లో రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ ఇంగ్లిష్ వంటి సబ్జెక్టులను ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యామండలి భావిస్తున్నది. ఇక నుంచి ఈ సబ్జెక్టులను చదవడం తప్పనిసరి చేయనుంది. జనరల్ ఇంగ్లిష్‌ను అన్ని కో ర్సుల్లో ప్రవేశపెట్టనుండగా, రీజనింగ్, అర్థమెటిక్గణితం, స్టాటిస్టిక్స్ వంటి సబ్జెక్టులను అంతర్భాగం చేయనున్నారు. బీఏ, బీకాం, బీఎస్సీ లైఫ్ సైన్సెస్ కోర్సుల్లోనూ వీలును బట్టి ఉద్యోగ నియామకపరీక్షల్లో ఎదురయ్యే సిలబస్‌ను అంతర్భాగం చేయాలని భావిస్తున్నారు. మార్చి నెలాఖరుకు సిలబస్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.