నమస్తే తెలంగాణ న్యూస్‌నెట్‌వర్క్, ఏప్రిల్ 13: ప్రతిపక్ష పార్టీల నేతలు కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, వారిని నమ్మొద్దని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. మంచి చేసే ప్రభుత్వానికి అండగా ఉంటూ, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించి సీఎం కేసీఆర్‌కు హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని పిలుపునిచ్చారు. గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రితో పాటు ఎంపీ రాములు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, జెడ్పీ చైర్పర్సన్ శాంతకుమారి పాల్గొన్నారు. కాగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ నియోజకవర్గం తాడూరు మండలం ఇంద్రకల్లో నిర్వహించిన బీఆర్ఎస్ కుటుంబ ఆత్మీయ సమ్మేళనంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పాల్గొ న్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ పాల్గొన్నారు.
మంత్రి జగదీశ్‌రెడ్డి ఇలాక అయిన సూర్యాపేట నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాల జాతర అట్టహాసంగా సాగుతున్నది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు చివ్వెంల మండలంలో 11 పంచాయతీల గులాబీ శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. గులాబీ దండు ఇండ్లకు తాళాలు వేసి పిల్లాపాపలతో తరలిరావడం విశేషం. మంత్రి జగదీశ్‌రెడ్డి సతీమణి సునీత, తనయుడు వేమన్‌రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం మంత్రి దంపతులతో కలిసి సహపంక్తి భోజనాలు, సాయంత్రం స్నాక్స్‌తో మధ్య మధ్యలో మజ్జిగ ప్యాకెట్లు అందించారు.