Jogu Ramanna | కాంగ్రెస్ పాలనలో వ్యవసాయ రంగం సంక్షోభం : మాజీ మంత్రి జోగు రామన్న
Jogu Ramanna | కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు ఆరు గ్యారెంటీ లతోపాటు 420 హామీలను అమలు చేయడంలో విఫలమైందని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు.
ఆదిలాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Rule ) ఎన్నికల హామీలు ఆరు గ్యారెంటీ లతోపాటు 420 హామీలను అమలు చేయడంలో విఫలమైందని మాజీ మంత్రి జోగు రామన్న ( Jogu Ramanna ) విమర్శించారు. గురువారం కాంగ్రెస్ ప్రభుత్వం వేయి రోజుల పాలన లో వ్యవసాయ రంగం సంక్షోభం ( Agricultural Sector Crisis ) లో కూరుకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ఆర్ గ్యారంటీలో భాగంగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా పథకం కింద ఎకరాకు 15 వేల రూపాయలు, వ్యవసాయ కూలీలకు ఆర్థిక సాయం హామీలు ఇచ్చి రైతులను మోసం చేసిందన్నారు. రెండు లక్షల రుణమాఫీ చేశామంటూ ముఖ్యమంత్రి అబద్ధాలు మాట్లాడుతున్నారని, రైతు భరోసా పథకాన్ని ఎగొట్టి పూర్తి స్థాయిలో చెల్లించినట్టు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని తెలిపారు.
రైతు బీమా పథకాన్ని రద్దు చేయడంతో అన్నదాతల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని తెలిపారు . రైతులు కష్టపడి సాగు చేసిన పంటలను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కరెంటు కోతల వల్ల రైతులు పంటలు సాగు చేసుకునే పరిస్థితి లేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు . రైతుబంధు, రైతు బీమా ఇలాంటి పథకాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

