హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 2025-26 విద్యా సంవత్సరానికిగాను పీజీ(రెగ్యులర్, ప్రత్యేక కోటా), పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుల గడువును పొడగించినట్టు వర్సిటీ రిజిస్ట్రార్ విద్యాసాగర్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 12న సాయం త్రం 5 గంటల్లోగా ఆన్లైన్లో సమర్పించాలని సూచించారు. ఈ నెల 11వరకు దరఖాస్తు రుసుము చెల్లించవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువు పొడిగించినట్టు స్పష్టంచేశారు. పూర్తి వివరాలు www.pjtau. edu.inలో అందుబాటులో ఉన్నట్టు రిజిస్ట్రార్ తెలిపారు.
హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ)కొత్త సభ్యులు సోమవారం ప్రమాణస్వీకారం చేశా రు. కొత్తగా నియమితులైన విశ్వప్రసాద్, చంద్రకాంత్రెడ్డితో చైర్మన్ బుర్రా వెంకటేశం నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు అమీర్ ఉల్లాఖాన్, ప్రొఫెసర్ ఎన్ యాదయ్య, పాల్వాయి రజినీకుమారి, ప్రొఫెసర్ ఎల్బీ రాథోడ్, కార్యదర్శి ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.