Telangana | హైదరాబాద్, మే 3(నమస్తే తెలంగాణ): ఉన్నత విద్యలో తెలంగాణ ఆవిర్భావం అనంతరం ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు, సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఏటేటా డిగ్రీ కాలేజీల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరుగుతున్నా యి. ‘దోస్త్’ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రంలోని 136 కళాశాలల్లో గణనీయంగా పెరుగుదల కనిపిస్తున్నదని ఉన్నత విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. 2018-19లో 28,035 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోగా, 2023-24 విద్యాసంవత్సరానికి 50, 477కు పెరిగాయి. అంటే ఏడేండ్లలో 22,442 మంది(80% వృద్ధి) ప్రవేశాలు పొందడమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు.
2019లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్(సీబీసీఎస్)ను అమల్లోకి తీసుకువచ్చింది. దీంతో ఏకంగా ఒకే ఏడాదిలో 14,250 అడ్మిషన్లు పెరిగాయి. ఆ తర్వాత సైతం గణనీయ వృద్ధి నమోదవుతూ వస్తున్నది. తాజాగా 2024-25 విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని 28 డిగ్రీ కాలేజీల్లో ఐటీల తరహాలో అప్రెంటిషిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్(ఏబీఈడీ)ని అమలు చేయాలని నిర్ణయించారు. డిగ్రీ పూర్తిచేసిన వెంటనే ఉపా ధి అవకాశాలు మెరుగవుతాయని విద్యారంగ నిపుణులు భావిస్తున్నారు.
మరింత మంది విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చదివేందుకు ఆసక్తిచూపుతారని విశ్లేషిస్తున్నారు. విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు ఉన్నతా ధికారుల ఆదేశాలతో అధికారులు చర్య లు తీసుకుంటున్నారు. విద్యార్థులు చదువు కొనసాగిస్తున్న సమయంలోనే కోర్సులకు సంబంధించి నైపుణ్యాలపై సాంకేతిక శిక్షణ ఇస్తున్నారు. బీకాం(బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్), బీఎస్సీ (టూరిజం అండ్ హాస్పిటాలిటీ ఆపరేషన్స్), బీఎస్సీ డిజిటల్/ఇండస్ట్రీయల్ ఎలాక్ట్రానిక్స్, బీఎస్సీ (మార్కెటింగ్ అండ్ సేల్స్), బీఎస్సీ(ఫార్మాస్యుటికల్ మ్యాన్ఫ్యాక్చరింగ్ అండ్ క్వాలిటీ), బీబీఏ (కాంటెంట్ అండ్ క్రియేటివ్ రైటింగ్) కోర్సుల్లో ఈ అవకాశం కల్పించారు.