హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): ‘రాజ్యాంగంలోని ఆర్టికల్-21 ప్రకా రం దర్యా ప్తు సంస్థల వద్దకు విచారణకు వెళ్లే వ్యక్తి లాయర్‌ను వెంట తీసుకెళ్లొచ్చు. కానీ, కేటీఆర్ విషయంలో ఏసీ బీ ఇందుకు విరుద్ధంగా వ్యవహరించింది. తప్పుడు ఉద్దేశంతోనే అనుమతి నిరాకరించినట్టు అర్థమవుతున్నది’ అని ప్రముఖ న్యాయవాది సోమా భరత్ వ్యాఖ్యానించారు. న్యాయవాది అంటే కోర్టు అధికారి అనే విషయాన్ని పట్టించుకోకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. సోమవా రం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడు తూ.. విచారణకు వెళ్లిన వ్యక్తిని డాక్యుమెంట్లు అడగడం విడ్డూరమని చెప్పారు. కేటీఆర్‌ను విచారణకు పిలిచి ఏసీబీ ఆఫీసులోనికి రానివ్వకపోడం అభ్యంతరకరమని పేర్కొన్నారు. ఆయనను గేట్ దగ్గరే నిలువరించిన పోలీసులు ఎవరితోనో ఫోన్లో మాట్లాడటం ఆక్షేపణీయమని అన్నారు. కేసు విచారణ ఇప్పటికే కోర్టు పరిధిలో ఉన్నదని గుర్తుచేశారు.