హనుమకొండ చౌరస్తా, జూన్ 14: తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్‌గా న్యాయవాది, తెలంగాణ ఉద్యమకారుడు గుడిమళ్ల రవికుమా ర్ ఎన్నికయ్యారు. ఆదివారం హనుమకొండ కాకతీయకాలనీలోని గుడిమళ్ల రవికుమార్ నివాసంలో తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక ఆవిర్భావ సమావేశం నిర్వహించగా, తెలంగాణ మలిదశ ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమకారుల డిమాండ్ల సాధనకు 20 మందితో కూడిన అడ్‌హక్ కమిటీని రవికుమార్ ప్రకటించారు. కమిటీలో సునీల్, శ్యా మ్కృష్ణ, రమేశ్, చాంద్‌పాషా, అశోక్, నెల్సన్, అంజాద్, రాజు, మనోహర్, నటరాజ్, స్వామి, రామ్‌కుమార్, దస్తగిరి, అశోక్, స్వర్ణలత, పద్మ, కృష్ణమూర్తి, ఉమ, సత్యం, ఇమ్మడిశెట్టి రాజు ఉన్నారు. ఈ నెల 18న కార్యాచరణ ప్రకటిస్తామని గుడిమళ్ల తెలిపారు.