హైదరాబాద్, అక్టోబర్ 26(నమస్తే తెలంగాణ): జర్నలిస్టుల అక్రెడిటేషన్ విధివిధానాలు, మార్గదర్శకాలపై సలహాలు, సూచన లు ఇవ్వాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి జర్నలిస్టు యూనియన్లు, ప్రెస్‌క్లబ్‌ల బాధ్యులు, సీనియర్ జర్నలిస్టులను కోరారు.
నవంబర్ 15లోగా సమాచార, పౌరసంబంధాలశాఖ. జాయింట్ డైరెక్టర్‌కు రాతపూర్వకంగా సమర్పించాలని విజ్ఞప్తిచేశారు. శనివారం ప్రత్యేక కమిటీ తొలి సమావేశాన్ని హైదరాబాద్‌లోని బూర్గుల రామకృష్ణారావు భవన్లో నిర్వహించారు.