Gurukul Admissions | హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ) : ప్రవేశ పరీక్ష, ఎలాంటి ఫీజు లేకుండానే ఎస్సీ గురుకుల జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు కల్పించాలని నిర్ణయించారు. పదో తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగానే సీట్లు కేటాయించనున్నారు. అన్ని గురుకుల కాలేజీల్లో ప్రవేశానికి ఈనెల 22 నుంచి మే 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాష్ట్రంలో 268 ఎస్సీ గురుకుల జూనియర్ కాలేజీలుండగా, 20వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 50% ఎస్సీ గురుకులాల్లో టెన్త్ పూర్తిచేసిన విద్యార్థులకు కేటాయిస్తారు. మిగిలిన 50% సీట్లను ప్రభుత్వ పాఠశాలలు, ఇతర సొసైటీల్లో చదువుకున్న విద్యార్థులతో భర్తీ చేస్తారు. ప్రభుత్వం గురువారం మార్గదర్శకాలు విడుదల చేసిందని అధికారులు వెల్లడించారు.