హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ‘ధరణి’ పోర్టల్‌ను ఏర్పాటు చేయడంతో వీఆర్వోల అవసరం లేకుండాపోయిందని, అందుకే వారిని ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేశామని ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు తెలిపింది. ఇది విధాన నిర్ణయమని, దీనిలో కోర్టుల జోక్యానికి ఆస్కారం లేదని ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్ ప్రసాద్ చెప్పారు. వీఆర్వో వ్యవస్థను రద్దుచేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టేయాలని కోరారు. దీంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.