హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించిన హైకోర్టు తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.
ఈలోగా కౌంటర్ దాఖలు చేయాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బీ ప్రశాంత్ మరో ఇద్దరు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ పీ మాధవీదేవి ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.