మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆకర్షితులై ప్రజలు టీఆర్ఎస్లో చేరుతున్నారని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అన్నారు. మహబూబాబాద్ పట్టణంలోని పత్తిపాకకు చెందిన 100 మంది వివిధ పార్టీలకు రాజీనామా చేసి ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్ చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ. మహబూబాబాద్‌లో సీపీఎం పార్టీకి కాలం చెల్లినట్లే అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. కాగా, పత్తిపాక కాలనీకి ఎమ్మెల్యే రాగానే డప్పు చప్పుళ్లు, పూల వర్షంతో ఘనంగా స్వాగతం పలికారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డా.రామ్మోహన్ రెడ్డి, పర్కాల శ్రీనివాస్ రెడ్డి, మర్నేని వెంకన్న, సూదగని మురళి, నాయిని రంజిత్, గోగుల రాజు, ఎలెందర్, యకయ్య, రాధమ్మ తదితరులు ఉన్నారు.