హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకులాల నిర్వహణకు ప్రభుత్వం అదనంగా రూ.256 కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గురుకులాలకు ప్రభుత్వం రూ.251 కోట్లను ప్రతిపాదించగా, ఆ మేరకు నిధులను విడుదల చేసింది. తాజాగా గురుకుల ఉద్యోగుల వేతనాలు, ఇతర ఖర్చుల నిర్వహణకు అదనంగా రూ.256 కోట్లు విడుదల చేసింది. మరోవైపు సంక్షేమ హాస్టళ్ల నిర్వహణకు రూ.13.50కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్, జనవరి 8(నమస్తే తెలంగాణ): ఈ నెల 13 నుంచి ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని సీఎం రేవంత్‌రెడ్డిని మంత్రి కొండా సురేఖ కోరారు. ఈ మేరకు బుధవారం ఆహ్వానపత్రికను అందజేశారు. ఆలయ ఈవో, సిబ్బంది సీఎంకు స్వామివారి ప్రసాదాలను అందజేశారు.