కరోనాకు మందు.. ఆశలు రేకెత్తిస్తోన్న ‘అడ్డసరం’
అడ్డసరం | ఆ మొక్క పేరే అడ్డ సరం. కరోనా వైరస్‌పై ఈ మొక్క ఏ మేరకు పని చేస్తుందనే విషయంపై ఢిల్లీలోని ఆయుర్వేద, రెస్పిరేటరీ రీసెర్చ్ సెంటర్ ఫర్ అప్లయ్డ్ డెవలప్మెంట్ అండ్ జీనోమిమ్స్, ఐజీఐబీ వంటి జాతీయ సంస్థలు సంయుక్తంగా పరిశోధనలు చేపట్టాయి

హైదరాబాద్ : కరోనా వైరస్ మహమ్మారి దేశంలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఈ వైరస్ నివారణకు మందు కనుగొనేందుకు శాస్ర్తవేత్తలు అనేక పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికే పలు రకాల టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ టీకాలకు తోడుగా ఓ మందును అందుబాటులోకి తెచ్చేందుకు శాస్ర్తవేత్తలు కృషి చేస్తున్నారు.
పొలం గట్ల వద్ద పెరిగే ఓ మొక్కపై శాస్ర్తవేత్తలు దృష్టి సారించారు. ఆ మొక్క పేరే అడ్డ సరం. కరోనా వైరస్‌పై ఈ మొక్క ఏ మేరకు పని చేస్తుందనే విషయంపై ఢిల్లీలోని ఆయుర్వేద, రెస్పిరేటరీ రీసెర్చ్ సెంటర్ ఫర్ అప్లయ్డ్ డెవలప్మెంట్ అండ్ జీనోమిమ్స్, ఐజీఐబీ వంటి జాతీయ సంస్థలు సంయుక్తంగా పరిశోధనలు చేపట్టాయి. అయితే ఈ మొక్క సానుకూల ఫలితాలు ఇవ్వడంతో ఆశలను రేకెత్తిస్తోంది.
కొవిడ్ బారిన పడిన రోగుల్లో రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం, రక్త గడ్డ కట్టడం, ఊపిరితిత్తులోని కణజాలం దెబ్బతినడంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనడం చూస్తున్నాం. అయితే ఈ మూడు వ్యవస్థలను మెరుగుపర్చడంలో అడ్డసరం మొక్క దోహదపడుతుందని పరిశోధనల్లో తేలింది. వైరస్ ప్రభావాన్ని తగ్గించడానికి, రోగనిరోధకశక్తిని పెంచడానికి తోడ్పడే జన్యువులకు సహాయపడే గుణాలు అడ్డసరం మూలికలలో ఉన్నాయని అధ్యయనం కనుగొంది. ఈ పరిశోధన పత్రం తాజాగా రెస్పిరేటరీ రీసెర్చ్ పబ్లికేషన్‌లో ప్రచురితం అయింది.
అడ్డసరం మొక్కు ఔషధ మొక్కగా ప్రాధాన్యం ఉంది. వీటి ఆకులు, పుష్పాలు, వేర్లు, బెరడును మందుల తయారీలో విరివిగా వాడుతుంటారు. దగ్గు, ఉబ్బసం, రక్తస్రావం నివారణ, చర్మవ్యాధుల చికిత్సలోనూ వినియోగిస్తారు. అడ్డసరము ఆకులను దగ్గుకు, ఉబ్బసానికి, రక్త శ్రావ లోపాలకు, చర్మ వ్యాధులకు మందుగా వాడతారు.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రంలో కొత్తగా 4009 కరోనా కేసులు
దేశంలో కరోనా కరాళ నృత్యం.. 24 గంటల్లో భారీగా కొత్త కేసులు
ఈజిప్టులో పట్టాలు తప్పిన రైలు.. 11 మంది మృతి
ఆరోగ్యంగా వేములవాడ రాజన్న ఆలయ స్థానాచార్యులు
నల్లగొండలో దారుణం.. ఆరుబయట నిద్రిస్తున్న దంపతుల హత్య
ప్రైవేటు టీచర్లు, సిబ్బందికి ఆర్థికసాయం రేపటి నుంచి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

