‘మూసీ’ టెండర్లకు ఆదరణ కరువు
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు మొదటి దశకు రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లు పిలిచినప్పటికీ ఆశించిన స్థాయిలో స్పందన లభించడంలేదు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) విధించిన కఠిన నిబంధనలే ఇందుకు కారణమని తెలుస్తున్నది. హైదరాబాద్‌లోని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల్) కార్యాలయంలో ఇటీవల నిర్వహించిన ప్రీ-బిడ్ సమావేశానికి హాజరైన జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ ప్రాజెక్టు విధివిధానాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం.
- ఏడీబీ కఠిన నిబంధనలతో జంకుతున్న ఏజెన్సీలు
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు మొదటి దశకు రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లు పిలిచినప్పటికీ ఆశించిన స్థాయిలో స్పందన లభించడంలేదు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) విధించిన కఠిన నిబంధనలే ఇందుకు కారణమని తెలుస్తున్నది. హైదరాబాద్‌లోని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల్) కార్యాలయంలో ఇటీవల నిర్వహించిన ప్రీ-బిడ్ సమావేశానికి హాజరైన జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ ప్రాజెక్టు విధివిధానాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. మూసీ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తిగా ఏడీబీ నిబంధనల మేరకే సాగుతున్నది.
ఏడీబీలో సభ్యత్వమున్న 68 దేశాల సంస్థలకు ఈ టెండర్లలో అవకాశం కల్పించినట్టు ఎంఆర్డీసీఎల్ చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు డీపీఆర్, ఫైనాన్సింగ్ నమూనాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. భారీ వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టులో పెట్టుబడులు, రిస్ షేరింగ్ ఎలా ఉంటుందనే దానిపై స్పష్టత లేకపోవడంతో కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. టెండర్ నోటిఫికేషన్ మొదలుకొని ఏజెన్సీల ఎంపిక, అగ్రిమెంట్, వర్ ఆర్డర్ జారీచేసే వరకు ప్రతి దశలోనూ ఏడీబీ నిబంధనలను పక్కాగా అమలు చేయాల్సిందే. వీటిలో ఏ చిన్న నిబంధనను అతిక్రమించినా, పనుల్లో ఎలాంటి అవినీతి, అక్రమాలు జరిగినట్టు తేలినా ఏడీబీ బిల్లులు నిలిపివేసే అవకాశం ఉండటం గుత్తేదారులను భయాందోళనకు గురిచేస్తున్నది.
బిల్లుల విడుదల నిలిచిపోవడమే కాకుండా ఇప్పటికే ఇచ్చిన నిధులను కూడా వెనకి తీసుకోవడం, ఇకపై ఏడీబీ అనుబంధ ప్రాజెక్టుల్లో అవకాశం లేకుండా బ్లాక్‌చేసే అవకాశం ఉండటంతో బడా కంపెనీలు ముందుకు రావడం లేదు. ఈ ప్రాజెక్టుకు నవంబర్ 26లోగా బిడ్లు దాఖలు చేయాల్సి ఉన్నది. నవంబర్ 27 ఉదయం 11 గంటలకు టెక్నికల్ బిడ్లను ఓపెన్ చేయనున్నారు. టెక్నికల్ అర్హతలతోపాటు ఫైనాన్షియల్ సోర్ను కూడా ఏడీబీ బేరీజు వేయనున్నది. దీనితోపాటు ఇతర కఠిన నిబంధనలపై ఏజెన్సీలు వ్యక్తం చేస్తున్న సందేహాలను అధికారులు నివృత్తి చేయడం లేదు. దీంతో గ్లోబల్ టెండర్లకు ఆదరణ లభించడం లేదంటూ రీటెండర్లలో తమకు నచ్చిన స్వదేశీ కంపెనీలకు అనుకూలంగా నిబంధనలను మార్చేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్ర చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

