రామన్నపేట, జనవరి16 : రామన్నపేటలో నిర్మించతలపెట్టిన అదానీ గ్రూప్ అంబుజా సిమెంట్ పరిశ్రమను రద్దు చేస్తున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో అంబు జాసిమెంట్ ప్రతిపాదిత స్థలాన్ని గురువా రం ఆయన పరిశీలించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే అంబుజా సిమెంట్ పరిశ్రమను ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలంతా ముక్త కంఠంతో వ్యతిరేకించారని తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ జరిగి నాలు గు నెలలు కావస్తున్నా రద్దు చేయడంలో ప్రభుత్వం ఎందుకు చోద్యం చేస్తుందో ప్రజలకు వివరించాలని చెప్పారు. రామన్నపేటను మరో లగచర్లగా మార్చొదని తెలిపారు.
హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్తు బస్సులతో ఆర్టీసీలో డ్రైవర్, మెకానిక్, శ్రామికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని టీఎంయూ ప్రధాన కార్యదర్శి థామస్‌రెడ్డి, టీజీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వరర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రాజిరెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మేరకు గురువారం వారు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం విద్యుత్తు బస్సులను తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నామని.. కానీ, వాటి తయారీ, నిర్వహణను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొన్నారు. విద్యుత్తు బస్సుల కోసం కోట్లాది రూపాయల ప్రజల డబ్బులను సబ్సిడీల పేరిట పెట్టుబడిదారులకు కట్టపెడుతున్నారని విమర్శించారు. విద్యుత్తు బస్సుల పథకానికి కేటాయించిన డబ్బులతో ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేసి దామాషా పద్ధతిలో రాష్ర్టాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. జేఎన్ఎన్యూఆర్ఎం పథకం ద్వారా ఆర్టీసీలకు బస్సులను గ్రాంట్‌గా ఇచ్చిన మాదిరిగానే విద్యు త్తు బస్సులను కూడా ఇవ్వాలని పేర్కొన్నారు. విద్యుత్తు బస్సుల పథకంలో మా ర్పులు చేస్తూ ఆర్టీసీ యాజమాన్యాలే నేరు గా బస్సులను కొనుగోలు చేసి నిర్వహించుకునేలా కొత్త పాలసీ తీసుకురావాలని థామస్‌రెడ్డి, రాజిరెడ్డి డిమాండ్ చేశారు.