మణికొండ, జూలై 5: టాలీవుడ్ హీరో రాజ్‌తరుణ్ గతంలో రెడ్‌హ్యాండెడ్‌గా డ్రగ్స్ తీసుకుంటూ తన నివాసంలో పోలీసులకు దొరికిన విషయం మరవకముందే… తాజా గా మరో వివాదంలో చిక్కుకున్నాడు. పదకొండేండ్లుగా ప్రేమాయణం నడిపి తనను శారీరకంగా వాడుకుని ఇప్పుడు వదిలించుకునేందుకు యత్నిస్తున్నాడంటూ లావణ్య శుక్రవారం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
హీరో రాజ్‌తరుణ్, తాను పదకొండేండ్లుగా ప్రేమించుకుంటున్నామని, అనేకసార్లు శారీరకంగా కలిశామని లావణ్య ఫిర్యాదులో తెలిపింది. ఇప్పుడు వదిలించుకునేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నాడని పేర్కొంది. ఓ హీరోయిన్‌తో ప్రేమాయణం నడుపుతూ, తనను మోసం చేయాలని చూస్తున్నాడని వాపోయింది. రాజ్‌తరుణ్‌ను వదిలేయాలని లేకపోతే తనను చంపేస్తానంటూ, అతడి సోదరుడు ఫోన్లో బెదిరింపులకు పాల్పడుతున్నాడని వెల్లడించింది.
గతంలో డ్రగ్స్ కేసులో తనను ఇరికించారని, రాజ్‌తరుణ్ కోసం తాను 45 రోజులపాటు జైలులో ఉన్నానని తెలిపింది. రాజ్‌తరుణ్ విచ్చలవిడిగా డ్రగ్స్‌కు అలవాటుపడి అమ్మాయిలతో పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తున్నారంటూ 4 పేజీల ఫిర్యాదును పోలీసులకు అందజేసింది. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తెలిపారు.