హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ) : బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ విచారణ కోసం ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి బుధవారం వచ్చిన ఆయనను ఈడీ అధికారులు ఐదు గంటల పాటు విచారించారు.
జంగిల్ రమ్మీ బెట్టింగ్ యాప్ ప్రచారంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రకాశ్‌రాజ్ నుంచి ఈడీ స్టేట్మెంట్ రికార్డు చేసింది. అనంతరం ప్రకాశ్‌రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. 2016లో జంగిల్ రమ్మీ యాప్‌కు ప్రచారం చేశా నని, ఇందుకు నిర్వాహకుల నుంచి తనకు డబ్బులు అందలేదని చెప్పారు.