ప్రాణం తీసిన ఇందిరమ్మ బిల్లు!.. మనస్తాపంతో ఉద్యమకారుడి ఆత్మహత్య
ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు రాక.. లబ్ధిదారులు డబ్బులు ఇవ్వక ఓ ఉద్యమకారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ నగరంలోని కాశీబుగ్గలో మంగళవారం చోటుచేసుకున్నది.
- దళితబంధుతో సిమెంట్, ఐరన్ షాపు ఏర్పాటు
- అరువుపై సరుకు తీసుకెళ్లిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు
- డబ్బులడిగితే బిల్లులు రాలేదంటూ దాటవేత
కాశీబుగ్గ, జూన్ 23 : ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు రాక.. లబ్ధిదారులు డబ్బులు ఇవ్వక ఓ ఉద్యమకారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ నగరంలోని కాశీబుగ్గలో మంగళవారం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. తెలంగాణ ఉద్యమకారుడు జెట్టి అశోక్ (54) బీఆర్ఎస్ హయాం లో మూడేండ్ల క్రితం దళిత బంధు పథకంలో లబ్ధిపొంది 14వ డివిజన్ రెడ్డిపాలెం జంక్షన్లో సిమెంట్ అండ్ ఐరన్ షాపు ఏర్పాటు చేసుకొని వ్యాపారం నిర్వహిస్తున్నాడు.
ఇటీవల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కోసం మేస్త్రీలు, స్థానికులకు తన స్థోమతకు మించి అరువుపై స రుకు సరఫరా చేశా డు. వారిని డబ్బులు అడిగితే ఇందిరమ్మ బిల్లులు రాలేదని దాటవేస్తున్నారు. షాపులో సరుకులేక, వస్తువులు తెచ్చినచోట డబ్బులు కట్టలేక మనస్తాపానికి గురైన అశోక్ రెడ్డిపాలెంలోని తన షాపులోనే మంగళవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎనుమాముల సీఐ జవ్వాజి సురేశ్ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశారు. మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మాజీ కార్పొరేటర్లు అశోక్ మృతదేహం వద్ద నివాళులర్పించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

