వరంగల్ : వరంగల్ వెస్ట్ నియోజకవర్గ క్యాంపు ఆఫీస్ శిలా ఫలకం (Stone plaque) ధ్వసం చేసిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ( MLA Naini Rajender Reddy) అనుచరులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పోలీసు కమిషనర్ అంబర్ కిశోర్ ఝాను కోరారు. ఇటీవల హనుమకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ శిలాఫలకం ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అనుచరులు ధ్వసం చేసిన ఘటన పై వినయ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్ రాజ్, కార్పొరేటర్లతో కలిసి వినయ్ భాస్కర్ సీపీ కార్యాలయంలో సీపీని కలిసి వినతి పత్రం అందజేశారు.