ఇల్లెందు, జూన్ 29 : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొన్నిరోజులుగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న మహా టీవీ న్యూస్ చానల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇల్లెందు బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులోని కొత్త బస్టాండ్ సెంటర్లో బీఆర్ఎస్ నాయకుడు దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకొని నల్లబ్యాడ్జీలు ధరించి మహాన్యూస్ చానల్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ను వెంటనే విడుదల చేయాలని, మహాన్యూస్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో నాయకులు సిలివేరి సత్యనారాయణ, టీబీజీకేఎస్ నాయకుడు ఎస్ రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.