హైదరాబాద్, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా నిబంధనలు పాటించని ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ల(డీసీ)పై చర్యలు తీసుకోవాలని అఖిలభారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) రాష్ట్ర సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమశాఖ అడిషనల్ డైరెక్టర్ పుష్పకు వినతిపత్రం అందజేసింది.
ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలీఉల్లా ఖాద్రీ, కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ.. ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. అనుమతుల్లేకుండా రోగనిర్ధారణ కేంద్రాల నిర్వహణ, కనీస జాగ్రత్తలు పాటించకుండానే నమూనాల సేకరణ చేస్తున్నట్టు పేర్కొన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ) : అంతర్రాష్ట్ర నదీ జలాల విభాగం(ఐఎస్డబ్ల్యూఆర్) చీఫ్ ఇంజినీర్‌గా కే ప్రసాద్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు సాగునీటిపారుదలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్‌బొజ్జా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రసాద్ ప్రస్తుతం సీఈ ఎంక్వైరీస్గా కొనసాగుతున్నారు.