హైదరాబాద్, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ): బ్లడ్ బ్యాంకుల్లో అక్రమంగా రక్తం, ఇతర ఉత్పత్తులను నిల్వ చేయడం, అధిక ధరలు వసూలు చేయడంపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు దృష్టిసారించారు. ఇప్పటికే తొమ్మిది బ్లడ్ బ్యాంకులకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బ్లడ్ బ్యాంకుల్లో ధరల జాబితాను విడుదల చేశారు. అదనంగా చార్జీ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తలసేమియా, హీమోఫీలియా, సికిల్ సెల్ అనీమియా, ఇతర రక్త సంబంధ వ్యాధులతో బాధపడుతున్నవారికి ఉచితంగా రక్తం అందజేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
Blood Packets1