Shyam Prasad Meka | హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): సినీనటులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి శ్యామ్‌ప్రసాద్ మేకా స్పష్టంచేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలకు కేవలం క్షమాపణ సరిపోదని పేర్కొన్నారు.
శుక్రవారం ఓ మీడియా చానల్ డిబేట్లో పాల్గొన్న ఆయన మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డి ఆమెపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాల్సిందేనని చెప్పారు. సురేఖ అంశాన్ని పార్టీ క్రమశిక్షణా కమిటీకి అప్పగించాలని, వారు ఆమెపై చర్యలు చేపట్టాలని కోరారు.