నాంపల్లి క్రిమినల్ కోర్టులు, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : ఫోన్ల ట్యాపింగ్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ అధికారి దుగ్యాల ప్రణీత్‌కుమార్ అలియాస్ ప్రణీత్‌రావును శుక్రవారం చంచల్‌గూడ జైలు అధికారులు నాంపల్లిలోని 14వ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చారు. అలాగే భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్‌రావు సైతం కోర్టుకు హాజరుకాగా, విచారణను ఈ నెల 21కి వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు.