మెదక్ : మెదక్ జిల్లా చేగుంట మండలం బైపాస్ చెరువు కట్ట రహదారిపై రెండు ప్రైవేట్ బస్సులుPrivate Buses) ఢీ కొన్న ఘటనలో పలువురికి(Injureies) గాయాలయ్యాయి. బుధవారం ఉదయం చందంపేట ఎమ్మెస్ అండ్ కంపెనీకి చెందిన బస్సు యూ టర్న్ చేస్తుండగా వెనుక నుంచి వచ్చిన మరో ప్రైవేట్ బస్సు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో ముందర ఉన్న ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రవి శంకర్ రెడ్డి అనే ప్రయాణికుడికి తీవ్ర గాయాలు కాగా మరో 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని హైదరాబాద్(Hyderabad) కు తరలించారు. పోలీసులు కేసు(Police Case) నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.