దామరచర్ల, ఫిబ్రవరి 14 : నల్లగొండ జిల్లాలోని యాదాద్రి పవర్‌ప్లాంటులో శుక్రవారం ప్రమాదం జరిగింది. యాష్ ప్లాంట్ ఈఎస్పీ వద్ద కాలిన బూడిద పడి ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్లాంటులోని రెండో యూనిట్ నుంచి ప్రస్తుతం 800 మెగావాట్ల విద్యుత్తు ఉత్పతి చేస్తున్న క్రమంలో ఈఎస్పీ వద్ద యాష్ జామ్ కావడంతో ట్రిప్ అయ్యి బాయిలర్ నిలిచిపోయింది. జామ్ అయిన యాష్‌ను తొలగిస్తున్న క్రమంలో ఒక్కసారిగా వేడి బూడిద మీడ పడి ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని హుటాహుటిన అంబులెన్సులో మిర్యాలగూడకు ఏరియా దవాఖానకు తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని డీఆర్డీవో దవాఖానకు తీసుకెళ్లారు.