DSC Notification | హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ శనివారంతో ముగిసింది. మొత్తంగా 1,76,530 దరఖాస్తులొచ్చాయి. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అత్యధికంగా 60,190 అప్లికేషన్లు వచ్చాయి. సెప్టెంబర్ 6న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగా, అదే నెల 20 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
దరఖాస్తుల గడువు ఈ నెల 21తో ముగియగా, అభ్యర్థుల వినతుల మేరకు మరో వారం పాటు పొడిగించారు. శనివారం వరకు మొత్తంగా 1,79, 297 మంది ఫీజు చెల్లించగా, సాయంత్రం వరకు 1.76లక్షల అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలను జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించే అవకాశాలున్నాయి.