హైదరాబాద్ : మల్కాజిగిరి జిల్లాలోని ఘట్కేసర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ప్లాట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ వ్యవహారంలో లంచం తీసుకుంటున్నారనే ఫిర్యాదు మేరకు.. అధికారులు సబ్ రిజిస్ట్రార్ సీతారాం, అసిస్టెంట్ కిశోర్‌ను అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మేడ్చల్ జిల్లా ఔషాపూర్ గ్రామ కంఠానికి సంబంధించిన రెండు ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు సుదర్శన్ అనే వ్యక్తి నుంచి రూ.70వేలు డిమాండ్ చేశారు.
దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా.. అధికారులు ఘట్కేసర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. లంచం తీసుకుంటుండగా సబ్ రిజిస్ట్రార్ సీతారాం, అసిస్టెంట్ కిశోర్‌లను అధికారులు పట్టుకున్నారు. లంచం అడగడం వల్లే తాను ఏసీబీని ఆశ్రయించానని బాధితుడు సుదర్శన్ పేర్కొన్నాడు. ఆ తర్వాత ఇద్దరిని అరెస్టు చేసి, అడిషనల్ స్పెషల్ జడ్జి ఎదుట హాజరుపరిచినట్లు పేర్కొన్నారు.