Kidney Disease Symptoms | ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే మీకు కిడ్నీ వ్యాధి ఉందని అర్థం..!
మన శరీర ఆరోగ్యాన్ని కాపాడడంలో మూత్రపిండాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. రక్తం నుండి విష పదార్థాలను తొలగించడం, శరీరంలో ద్రవాలను సమతుల్యం చేయడం, సోడియం, పొటాషియం, క్యాల్షియం వంటి ఖనిజాలను నియంత్రించడం వంటి ముఖ్యమైన విధులను మూత్రపిండాలు నిర్వర్తిస్తాయి.
Kidney Disease Symptoms | మన శరీర ఆరోగ్యాన్ని కాపాడడంలో మూత్రపిండాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. రక్తం నుండి విష పదార్థాలను తొలగించడం, శరీరంలో ద్రవాలను సమతుల్యం చేయడం, సోడియం, పొటాషియం, క్యాల్షియం వంటి ఖనిజాలను నియంత్రించడం వంటి ముఖ్యమైన విధులను మూత్రపిండాలు నిర్వర్తిస్తాయి. కనుక మనం మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరం. దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధిని ముందుగా గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సమస్య మరింత తీవ్రతరం కాకుండా కాపాడుకోవచ్చు. గ్లోమెరులర్ వడపోత రేటు, యూరిన్ అల్బుమిన్ టు క్రియాటినైన్ నిష్పత్తి వంటి సాధారణ మూత్రపిండాల పరీక్షలు చేయించుకోవడం వల్ల సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు, కోలుకునే సమయం కూడా తక్కువగా ఉంటుంది. మూత్రపిండాల సమస్యలను ముందుగానే గుర్తించడం వల్ల వ్యాధి మరింత తీవ్రతరం కాకుండా అడ్డుకోవచ్చు. దీంతో శరీర ఆరోగ్యం కూడా దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు.
అలసట, బలహీనత..
సకాలంలో చికిత్స తీసుకోవడం వల్ల మూత్రపిండాల వ్యాధిని సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు. ముందుగా మూత్రపిండాల వ్యాధులను వల్ల గుర్తించడం వల్ల మూత్రపిండాల పనితీరును మెరుగుపరుచుకోవడంతో పాటు మూత్రపిండాల మార్పిడి, డయాలసిస్ వంటి చికిత్స విధానాలను అరికట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. కనుక మూత్రపిండాల సమస్యలను ముందుగా గుర్తించడం చాలా అవసరమని వారు పేర్కొంటున్నారు. మూత్రపిండాల వ్యాధులను గుర్తించే కొన్ని లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మూత్రపిండాల పనితీరు తగ్గడం వల్ల శరీరంలో విష పదార్థాలు పేరుకుపోతాయి. ఇది క్రమంగా అలసట, బలహీనతకు దారి తీస్తాయి. మూత్రపిండాల వ్యాధులు రక్తహీనతకు కూడా కారణమవుతాయి. దీంతో మరింత అలసటగా ఉంటుంది.
మూత్ర విసర్జనలో మార్పులు..
మూత్రపిండాల వ్యాధులతో బాధపడే వారిలో మూత్ర విసర్జనలో మార్పులు వస్తాయి. మూత్రపిండాల వ్యాధులను గుర్తించే ప్రారంభ సంకేతాల్లో ఇది ఒకటి. రాత్రి సమయంలో మూత్ర విసర్జన పెరగడం, ముదురు తుప్పు పట్టిన రంగులో మూత్రం రావడం, నురుగుతో కూడిన మూత్రం రావడం, మూత్రంలో రక్తం రావడం వంటి లక్షణాలు కూడా మూత్రపిండాల వ్యాధులను తెలియజేస్తాయి. అంతేకాకుండా మూత్రపిండాల సమస్య కారణంగా శరీరంలో సోడియం పేరుకుపోతుంది. తద్వారా పాదాలు, కాళ్లు, చేతులు, చీలమండలు వాపుకు గురి అవుతాయి. మూత్రపిండాల సమస్యల కారణంగా చర్మం దురద రావడం, కళ్ల చుట్టూ వాపులకు గురైనట్టు ఉండడం కూడా జరుగుతుంది. ఆకలి తగ్గుతుంది. వికారం, వాంతులు, బరువు తగ్గడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. మూత్రపిండాల పనితీరు తగ్గడం వల్ల నరాల పనితీరు తగ్గుతుంది. దీని వల్ల తిమ్మిర్లు వస్తాయి. మూత్రపిండాల సమస్యలు తలెత్తినప్పుడు ఇలా అనేక లక్షణాలను మన శరీరం చూపిస్తుంది. ఈ లక్షణాలను ముందుగా గుర్తించడం వల్ల సమస్య మరింత తీవ్రతరం కాకుండా నిరోధించడంతో పాటు మూత్రపిండాల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajnath Singh | దేశాన్ని అస్తిర పరిచేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఆందోళనలు.. ఇండియా బ్లాక్పై రాజ్నాథ్ సింగ్ ఆరోపణ
KTR | ఆంధ్రలో జల పండగ ఎట్లయితది? తెలంగాణలో కరువు ఎందుకుంటది? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
Kumbha | ‘కుంభ’లోని శక్తిని ఇప్పుడే తట్టిలేపాలని అనుకోవడం లేదు.. పృథ్వీరాజ్ బర్త్డేపై రాజమౌళి ట్వీట్
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

