Bikram Singh Majithia: జైలు నుంచి రిలీజైన బిక్రం సింగ్ మజితియా
Bikram Singh Majithia: మీసాలు తిప్పుకుంటూ జైలు నుంచి రిలీజ్ అయ్యారు బిక్రం సింగ్ మజితియా. సుమారు 700 కోట్ల అక్రమాస్తులు కలిగి ఉన్న కేసులో ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్నారు. సోమవారం సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరీ చేసిన విషయం తెలిసిందే.
చండీఘడ్: శిరోమణి అకాళీదల్ నేత, పంజాబ్ మాజీ మంత్రి బిక్రం సింగ్ మజితియా(Bikram Singh Majithia) ఇవాళ నాభా జైలు నుంచి బయటకు వచ్చారు. అక్రమాస్తులు కలిగి ఉన్న కేసులో సోమవారం సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరీ చేసిన విషయం తెలిసిందే. న్యాయపరమైన ప్రక్రియ వల్ల మతిజియా రిలీజై ఆలస్యమైంది. ఆయనకు స్వాగతం పలికేందుకు భార్యతో సహా పార్టీ వర్కర్లు జైలు వద్దకు వెళ్లారు. జైలు నుంచి బయటకు రాగానే మజితియా తన సహజరీతిలో మీసాలను మెలేశారు. ఓపెన్ టాప్ జీప్‌లో తన మద్దతుదారులతో కలిసి వెళ్లారు.
దాదాపు రూ.700 కోట్ల అక్రమాస్తులు కలిగి ఉన్నారని శిరోమణి అకాళీదల్ నేత బిక్రం సింగ్ మజితియా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన సుప్రీం ధర్మాసనం సోమవారం బెయిల్‌పై ఆదేశాలు జారీ చేసింది. కేసు పూర్వాపరాలు, విచారణ తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీం పేర్కొంది.
అక్రమాస్తుల కేసుకు సంబంధించి బిక్రం సింగ్‌పై సిట్ 2025 జూన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ వెంటనే అతడిని అమృత్ సర్‌లోని తన ఇంటి నుంచి పంజాబ్ విజిలెన్స్ బ్యూరో (వీబీ)కి చెందిన పోలీసులు అరెస్టు చేశారు. అప్పటినుంచి అతడు న్యూ నభా జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. దీంతో బిక్రం సింగ్.. పంజాబ్, హరియాణా హైకోర్టులో గతంలోనే బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఈ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. తర్వాత అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించగా బెయిల్ మంజూరు చేసింది.
మరోవైపు ఈ కేసులో గత ఆగష్టులోనే పోలీసులు సప్లిమెంటరీ ఫైల్స్తోకలిపి 40,000 పేజీల చార్జిషీటు దాఖలు చేశారు. పంజాబ్‌కు చెందిన మజితియా శిరోమణి అకాళిదల్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి, క్యాబినెట్ మంత్రిగా కూడా పని చేశారు. ఈ సమయంలో ఆయన అవినీతికి పాల్పడ్డాడనే ఆరోపణలొచ్చాయి. 2007-2017 మధ్య కాలంలో ఆయన, అతడి భార్య కలిపి వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో పంజాబ్ విజిలెన్స్ రంగంలోకి దిగి విచారణ జరుపుతోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

