హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): గొర్రెల పంపిణీ కేసును ప్రభుత్వం మళ్లీ తెరపైకి తెచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఖాజా మొయినుద్దీన్ ఇంట్లో గురువారం రాత్రి సోదాలు జరిగాయి. హైదరాబాద్ మణికొండలో ఏసీబీ బృందాలు సోదాలు చేపట్టాయి. ఖాజా మొయినుద్దీన్, అతని కుమారుడు ప్రస్తుతం దుబాయ్లో ఉన్నారు. మొయినుద్దీన్ రూ.700 కోట్ల కుంభకోణంలో నిందితుడిగా ఉన్నారు.
ఈ కేసులో ఇదివరకే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ చేపట్టింది. గతంలోనే ఏసీబీ పలువురిని అరెస్టు చేసి రిమాండ్ తరలించింది. ఈ సోదాలు శుక్రవారం కూడా కొనసాగే అవకాశం ఉన్నదని సమాచారం.