వ్యవసాయ రుణాల మంజూరులో లంచాలు!
వ్యవసాయ రుణాల మంజూరు, పంపిణీలో లంచాలు వసూలు చేశారన్న ఆరోపణలపై ఎస్బీఐ వజీర్బాద్ బ్రాంచ్ మేనేజర్ ఎం ఉదయ్గోపాల్పై హైదరాబాద్ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. నల్లగొండ జిల్లా వజీర్బాద్ బ్రాంచ్‌లో 2024 నుంచి 2025 మధ్య 109 మంది రుణగ్రహీతలకు మొత్తం రూ.2.10 కోట్ల వ్యవసాయ రుణాలను మంజూరు చేసి, వాటిని పంపిణీ చేసే క్రమంలో లంచాలు తీసుకున్నట్టు ప్రాథమిక సమాచారంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
- నల్లగొండలో ఎస్బీఐ మేనేజర్‌పై ఏసీబీ కేసు
- 2.10 కోట్ల రుణాలకు 52 లక్షల లంచం
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ రుణాల మంజూరు, పంపిణీలో లంచాలు వసూలు చేశారన్న ఆరోపణలపై ఎస్బీఐ వజీర్బాద్ బ్రాంచ్ మేనేజర్ ఎం ఉదయ్గోపాల్పై హైదరాబాద్ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. నల్లగొండ జిల్లా వజీర్బాద్ బ్రాంచ్‌లో 2024 నుంచి 2025 మధ్య 109 మంది రుణగ్రహీతలకు మొత్తం రూ.2.10 కోట్ల వ్యవసాయ రుణాలను మంజూరు చేసి, వాటిని పంపిణీ చేసే క్రమంలో లంచాలు తీసుకున్నట్టు ప్రాథమిక సమాచారంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ వ్యవహారంలో వడపల్లి గ్రామానికి చెందిన రూపావత్ సైదానాయక్ మధ్యవర్తిగా వ్యవహరించినట్టు ఆరోపణలు ఉన్నాయి.
సైదానాయక్ రుణగ్రహీతల నుంచి నగదు రూపంలో లంచాలు వసూలు చేసి, బ్యాంకు మేనేజర్ ఉదయ్గోపాల్తో 70:30 నిష్పత్తిలో పంచుకున్నట్టు ఏసీబీ అధికారులు పేరొన్నారు. సైదానాయక్ యూనియన్ బ్యాంక్‌లోని తన ఖాతా నుంచి రూ.43,97,927లను ఉదయ్గోపాల్ భార్య కోమలాదేవి హెచ్డీఎఫ్సీ ఖాతాకు బదిలీ చేసినట్టు ఏసీబీ పేరొంది. అలాగే రూ.8,56,930లను ఉదయ్గోపాల్ హెచ్డీఎఫ్సీ ఖాతాకు బదిలీ అయినట్టు ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఈ రెండు లావాదేవీల మొత్తం రూ.52,54,857గా తేల్చారు. ఎస్బీఐ వజీర్బాద్ బ్రాంచ్‌లో హౌస్‌కీపింగ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న షేక్ ఖాదర్ మొయినుద్దీన్, ఇమ్రాన్ షేక్ పత్రాల మార్పిడిలో సహకరించినట్టు ఏసీబీ చెప్పింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonam Wangchuk | నాయకులను రేపటిలోగా విడుదల చేయకపోతే.. నిరాహార దీక్ష చేస్తా: సోనమ్ వాంగ్‌చుక్
SA vs AUS | రెన్షా ‘తొలి డబుల్’ చేజారే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆలౌట్..!
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

