పెండ్లిళ్లలో ఒకే వంటకం.. 9 కల్లా దుకాణాలు బంద్
ఒక వైపు పశ్చిమాసియా సంక్షోభం పట్టిపీడిస్తుండగా, మరోవైపు ఎర్ర సముద్రంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులతో అంతర్జాతీయంగా తీవ్ర చమురు సంక్షోభం ఏర్పడుతున్నది.
- ఇంధన సంక్షోభంతో పాకిస్థాన్ ఆంక్షలు
ఇస్లామాబాద్, సెప్టెంబర్ 17: ఒక వైపు పశ్చిమాసియా సంక్షోభం పట్టిపీడిస్తుండగా, మరోవైపు ఎర్ర సముద్రంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులతో అంతర్జాతీయంగా తీవ్ర చమురు సంక్షోభం ఏర్పడుతున్నది. దీంతో అసలే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థాన్ ఈ సంక్షోభ పరిస్థితుల నుంచి కొంత ఉపశమనం పొందేందుకు పొదుపు తరహా ప్యాకేజీని అమలు చేయడానికి సిద్ధపడింది. ప్రభుత్వ వాహనాల కొనుగోలుపై పూర్తి నిషేధాన్ని విధించింది. ప్రభుత్వ వాహనాలకు ఇంధనం కేటాయింపులో 50 శాతం కోత విధించింది. వివాహ వేడుకల్లో సింగిల్ డిష్ నిబంధనను అమలులోకి తెచ్చింది.
ఇంధన కోతలతో పాటు మూడు నెలల వరకు అధికారులు విదేశీ పర్యటనలు చేయరాదని ఆంక్షలు విధించింది. ఇకపై మంత్రులు, సలహాదారులు, ముఖ్య అధికారులు ఎకానమీ తరగతిలో ప్రయాణించాలి. పొదుపు ఆంక్షలు పౌరులను కూడా ప్రభావితం చేస్తున్నాయి. పెండ్లిండ్లు, ఇతర వేడుకల్లో ఒక్క వంటకం మాత్రమే అతిథులకు వడ్డించాలని ఆదేశాలు జారీ చేసింది. దుకాణాలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, బజార్లు, డిపార్ట్మెంటల్, గ్రోసరీ స్టోర్లు రాత్రి తొమ్మిదికల్లా మూసివేయాలి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

