జగిత్యాల రూరల్, సెప్టెంబర్ 17 : జగిత్యాల రూరల్ మండలం ఒడ్డెరకాలనీలో ఓ తండ్రి చేతివలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం.. సూర రాజయ్య-లక్ష్మి దంపతులకు ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకు కరుణాకర్ ఆర్మీలో ఉద్యోగం చేస్తుండగా.. పెద్ద కొడుకు వెంకటేశ్ (22) సంవత్సరం క్రితం దుబాయ్ వెళ్లి 15 రోజుల క్రితం స్వగ్రామం చేరుకున్నాడు.
నాలుగేండ్లుగా తండ్రీ కొడుకుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. రాజయ్య గురువారం గొడ్డలితో వెంకటేశ్‌పై దాడిచేయడంతో మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్ పరిశీలించారు. సూర రాజయ్య రూరల్ పోలీస్ స్టేషన్లో ఉన్నట్టు తెలిసింది.