హైదరాబాద్, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ) : చెక్‌పోస్టుల వద్ద ప్రైవేట్ వ్యక్తులతో లారీ డ్రైవర్లు, క్లీనర్ల నుంచి డ బ్బులు వసూలు చేయిస్తున్నట్టు గు ర్తించిన ఏసీబీ అధికారులు ఆకస్మికదాడులు చేశా రు. వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రంలోని పలు అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టుల్లో అవినీతి కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు ఏసీబీ అధికారులు శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఏకకాలం లో దాడులు నిర్వహించారు.
విష్ణుపురం (నల్లగొండ), కోదాడ(సూర్యాపేట), కృష్ణ (నారాయణపేట), బోరాజ్(ఆదిలాబా ద్), మాడిగి(సంగారెడ్డి), పాల్వంచ, అ శ్వారావుపేట (భద్రాద్రికొత్తగూడెం), ము త్తగూడెం(ఖమ్మం), సలాబత్పూర్-మద్నూర్, పొందుర్తి(కామారెడ్డి) చెక్‌పోస్టు ల్లో తనిఖీలు చేసి రూ.4,18,880 నగదును స్వాధీనం చేసుకున్నారు.
పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా భోరజ్ చెక్‌పోస్టు వద్ద రూ.1.26 లక్షలు, నిర్మల్ జిల్లా బెల్‌తరోడా చెక్‌పోస్టు వద్ద రూ.3వేలు, సంగారెడ్డి జిల్లా మాడ్గి చెక్‌పోస్టు వద్ద రూ.42,300, ఉమ్మడి ఖమ్మం పాల్వంచలో రూ. 25,100, అశ్వారావుపేటలో రూ.23వేలు, ముత్తగూడెంలో 6,660, సలాబత్పూర్ చెక్‌పోస్టుపై దాడి సమయంలో రూ.36 వేలు, పొందుర్తి చెక్‌పోస్టు సోదాల్లో రూ.50,100, నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని చెక్‌పోస్టు తనిఖీలో రూ.లక్షకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.