హైదరాబాద్: కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ ఇంటిపై ఏసీబీ దాడులు (ACB Raids) నిర్వహిస్తున్నది. హైదరాబాద్ షేక్‌పేటలోని ఆదిత్య టవర్స్‌లోని ఆయన నివాసంలో శనివారం తెల్లవారుజాము నుంచి ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పత్రాలు, కంప్యూటర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో హరిరామ్ కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆయన నివాసంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తున్నది.
కాగా, హరిరామ్ ప్రస్తుతం కాళేశ్వరం గజ్వేల్ ప్రాంత ఈఎన్సీగా విధులు నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా కూడా పనిచేశారు. ప్రాజెక్టు అనుమతులు, రుణాల్లో కీలకంగా వ్యవహరించారు. ఆయన భార్య అని కూడా నీటిపారుదల శాఖలో డిప్యూటీ ఈఎన్సీగా పనిచేశారు. ప్రస్తుతం వాలంతరి డైరెక్టర్ జనరల్ బాధ్యతల్లో ఉన్నారు.